బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దుండగులు దాడి చేశారనే విషయం ఈరోజు ఉదయం నుంచి అభిమానులను కలకలం రేపేలా చేస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉలిక్కిపడినట్టుగా కనిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పైన అర్థరాత్రి కొంతమంది దుండగులు ఆరుసార్లు కత్తితో పొడిచారని అయితే ఈ దాడిలో రెండు కత్తిపోట్లు చాలా లోతుగా దిగాయంటూ కూడా వైద్యులు తెలియజేశారు. సైఫ్ అలీఖాన్ హత్య చేయాలని ఉద్దేశంతోనే ఇలా దాడి చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.




దీంతో సైఫ్ అలీ ఖాన్ సీసీ కెమెరాలను చెక్ చేయగా నిందితుడికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయట. నిందితుడి ఫోటోలను కూడా పోలీసులు బయట పెట్టడం జరిగింది. అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడంతో మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతూ ఉన్నారు. దొంగతనానికి వచ్చిన దొంగ సైప్ పైన దాడి చేసినట్లుగా పోలీసులు సైతం గుర్తించారట. అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో కీలకమైన విషయాలను పోలీసులు తెలియజేశారు.


నిందితుడు సైతం ఇంట్లోకి చొరబడి దాడి చేయడానికి ముందుగా సైఫ్ అలీ ఖాన్ ను కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లుగా పోలీసులు విచారణలో తెలియజేశారట. అయితే దీనికి ఒప్పుకోకపోవడంతో ఈ అదంతా కూడా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ పోలీసులు కూడా తెలియజేశారు. ప్రస్తుతమైతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారు.


ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ వెన్నుముకకు తీవ్రమైన గాయం అయింది అంటూ వైద్యులు తెలియజేశారు.. సర్జరీ చేసి వెన్నుముక నుంచి రెండు అంగుళాల కత్తిని కూడా తొలగించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ వెన్నుముకకు మేజర్ సర్జరీ కూడా చేసినట్లు సమాచారం. వీటితోపాట ఎడమ చేతికి రెండు ప్లాస్టిక్ సర్జరీలు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: