ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్ అవకాశాల కోసమే గ్లామర్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ పాటలకే గ్లామర్ డోస్  పెంచేస్తూ ఉన్నారు. మరి కొంతమంది నటనకు ప్రాధాన్యత ఇస్తూ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలా చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ సన్నివేషాలు నటించడానికి కొన్ని కండిషన్స్ కూడా పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హీరో తనను లిప్ కిస్ పెట్టుకున్నాడని ఏకంగా 100 సార్లు ముఖం కడుక్కున్నదట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.



సినిమా షూటింగ్లో భాగంగా ఒక హీరో తనను కిస్ చేసుకున్నందుకు 100 సార్లు ముఖం కడుక్కున్నాదట హీరోయిన్ రవీనా టాండన్. ఈమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. కే జి ఎఫ్-2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఈమె పేరు బాగా వినిపించింది. అలా తెలుగు, తమిళ్, కన్నడ వంటి సినిమాలలో నటించిన ఈమె గతంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేసింది.


సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తనను చాలా రఫ్గానే హ్యాండిల్ చేశారంటూ ఆ షూటింగ్లో.. ఒక హీరో పెదాలు తన పెదాలను అనుకోకుండా  తగలడంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది.. కానీ ఆ సమయంలో అది కిస్సింగ్ సన్నివేశాలు కూడా కాదని పొరపాటున జరిగింది దీని వల్ల చాలా ఇబ్బంది పడడంతో తనకు వికారంగా అనిపించిందని తెలిపింది. ఆ విషయాన్ని తాను లైట్గా తీసుకోలేకపోయానని వెంటనే వెళ్లి వాంతులు కూడా చేసుకున్నాను అంటూ తెలిపింది. సుమారుగా ఒక 100 సార్లు బ్రష్ చేసుకుని ముఖం కడుక్కున్నాను అంటూ వెల్లడించింది రవీనా టాండన్.. అయితే ఆ హీరోకు తన మీద ఎలాంటి ఉద్దేశం లేదని అనుకోకుండా జరగడంతో షూటింగ్ అయిపోయిన తర్వాత క్షమాపణలు కూడా చెప్పారని వెల్లడించింది.  తాను ఎప్పుడూ కూడా అలాంటి సన్నివేశాలలో నటించలేదని తెలిపింది రవీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: