ఆదివాసుల కాలం నాటి సినిమా అన్నట్టుగా ఇందులోని కొన్ని సన్నివేశాలను చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే అనుష్క, విక్రమ్ ప్రభు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇటీవలే విక్రమ్ ప్రభు కు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేయగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి హైప్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. అనుష్క ఇందులో చాలా మాసివ్ పాత్రలో కనిపిస్తూ ఉన్నది. అనుష్కని ఇంతవరకు అభిమానులు చూడని తరహాలో ఇందులో కనిపించబోతోంది.
అలాగే ప్రతి ఫ్రేం కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డట్టుగా కనిపిస్తోంది డైరెక్టర్ క్రిష్.. అనుష్క కూడా ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగలదని మరొకసారి ఘాటి సినిమాతో నిరూపించుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఏ మేరకు అభిమానులను అనుష్క ఈ సినిమాతో మెప్పిస్తుందో చూడాలి ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ క్రిష్ కూడా ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు షూటింగ్ ఆగిపోయింది. మరి అనుష్కతో తన కెరీర్ ని కం బ్యాక్ ఇస్తారా? అనుష్క కూడా సక్సెస్ అందుకొని అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుందేమో చూడాలి.ఏప్రిల్ 18వ తేదీన ఈ ఏడాది విడుదల కాబోతోంది.