ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ "లయ".. ఏ నిర్ణయాని అయినా సరే చాలా చక్కగా తీసుకుంటుంది అన్న అభిప్రాయం అందరికీ ఉంటుంది . కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా తెరికెక్కిన 'అరవింద సమేత' మూవీ అందరికీ గుర్తుండే ఉంటుందిగా . అయినా మర్చిపోయేటటువంటి మూవీ నా ఇది .. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ .
పూజా హెగ్డే కి మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమాలో 'రెడ్డమ్మ' పాత్ర పోషించిన ఈశ్వరిరావు హైలెట్గా మారింది . అయితే ఈ రెడ్డమ్మ పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు హీరోయిన్ లయను చూస్ చేసుకున్నారట .ఆమెను అప్రోచ్ అయి కథ కూడా వినిపించారట . అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకోలేదట . ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను ట్రై చేసి ఫైనల్ నటి ఈశ్వరి రావు కు ఆ ఛాన్స్ వచ్చేలా చేసుకునింది . రెడ్డమ్మ పాత్రకు ఆమె నూరు శాతం న్యాయం చేసింది అనడంలో సందేహం లేదు . ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో హైలెట్ అని చెప్పొచ్చు . అలా ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ మిస్ చేసుకుంది లయ