టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి సినిమాల కంటే కూడా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇకపోతే కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత అనేక సార్లు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. పవన్ కళ్యాణ్మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత భీమ్లా నాయక్ , బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి పూర్తి కూడా చేసేసాడు.

ఈ మూవీలు విడుదల కూడా అయ్యాయి. అయినా హరిహర వీరమల్లు సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఇలా ఈ మూవీ డిలే అవుతూ రావడంతో క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనుండగా ... ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంత కాలం క్రితం అధికారికంగా ప్రకటించారు.

సినిమా చాలా సార్లు స్టార్ట్ అయ్యే ఆగిపోవడంతో మామూలు ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా పవన్ అభిమానుల అంచనాలను అందుకుంటుందా.. ? భారీ స్థాయి విజయాన్ని సాధించగలుగుతుందా ..? అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: