ప్రభాస్ హీరో గా.. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ చేతిలో అరడజనకు పైగానే క్రేజీ ప్రాజెక్టుతో అల్లాడించేస్తున్న ప్రభాస్ .. ఈ నెల ఆఖరిలో సుకుమార్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట . ఆల్రెడీ సుకుమార్ ఒక స్క్రిప్ట్ ని ప్రభాస్ కి వినిపించారట . ఆయన ఇంట్రెస్ట్ కూడా చూపించారట . త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . అయితే ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఎన్ని హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అందరికీ తెలుసు .
ఇప్పుడు ప్రభాస్ తో సుకుమార్ సినిమా తెరకెక్కిస్తే మాత్రం అదే అటు ప్రభాస్ కి ఇటు సుకుమార్ కి ఇద్దరికీ హిట్ కన్ఫామ్ చేస్తుంది . రీసెంట్ గా పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీని ఎలా షేక్ చేసాడో సుకుమార్ అందరికీ తెలిసిందే . కాగా పుష్ప2కి మించిపోయే రేంజ్ లోనే ఈ సినిమా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొందరైతే బాహుబలికి అమ్మ మొగుడి లాంటి హిట్ కన్ఫామ్ అంటున్నారు . మొత్తానికి ఇన్నాళ్లకి ఫ్యాన్ స్ కోరిక తీర్చబోతున్నారు సుకుమార్-ప్రభాస్. చూడాలి మరి ఏం జరుగుతుందో..???