నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పెద్దగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన ఒక్కో విజయాన్ని అందుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో కూడా నాని నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలను అందుకోవడంతో నాని హీరో గా రూపొందుతున్న హిట్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఈ మూవీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా  రూపొందుతుంది. నాని సినిమా ఇండస్ట్రీ లో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతున్న ఆయన తన కెరియర్లో జెంటిల్ మేన్ మూవీ ని మినహాయిస్తే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఎక్కువగా నటించలేదు.

ఇక జెంటిల్ మెన్ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. జెంటిల్ మేన్ సినిమా తర్వాత చాలా సంవత్సరాలకు నాని క్రైమ్ సస్పెన్స్ జోనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం వరుస విజయాలతో ఉన్న నాని "హిట్ ది థర్డ్ కేస్" మూవీ తో ఆ విజయాలను అలాగే కంటిన్యూ చేస్తాడా ..? లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: