తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటనలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. 

ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబో లో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలను సాధించి ఉండడం , సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు , ప్రచార చిత్రాలు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు విడుదల అయిన మొదటి రోజు నుండి దక్కుతున్నాయి. 

దానితో ఈ సినిమా అత్యంత వేగంగా ఓ రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ , గుంటూరు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: