రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ఈ ఏడాది దసరా రేసులో ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ కోరుకున్న హిట్ బుచ్చిబాబు సినిమాతో దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది.
 
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తొలి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా రెండో సినిమాతో నిరాశ పరిచిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ కు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
 
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. చరణ్ తర్వాత సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రామ్ చరణ్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ కావడం దిల్ రాజుకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి: