మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ “ వార్ 2 “ లో నటిస్తున్నాడు..బ్రహ్మస్త్ర మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది..

ఈ సినిమాతో ఎన్టీఆర్ మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలలో నటిస్తున్నాడు.. అందులో ఒకటి దేశం కోసం ఎంతటి త్యాగం అయినా చేసే దేశభక్తుడిగా మరొకటి క్రూయల్ విలన్ గా నటిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్సినిమా షూటింగ్ ముగిసాకా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ప్రేక్షకులని మెప్పించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాలని చూస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: