విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే విడుదల అయిన రెండవ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో అద్భుతమైన స్థానంలో నిలిచింది.

రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఆర్ ఆర్ ఆర్ మూవీ 31.63 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , సలార్ మూవీ 21.23 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. కల్కి 2898 AD సినిమా 20 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 మూవీ 19.25 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. దేవర పార్ట్ 1 మూవీ 17.092 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఆది పురుష్ మూవీ 15.04 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. బాహుబలి 2 సినిమా 14.80 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.24 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇలా ఈ మూవీ ఏకంగా పాన్ ఇండియా సినిమాల స్థాయిలో రెండవ రోజు కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన రికార్డును నెలకొల్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: