నందమూరి బాలయ్య ఈ సంక్రాంతికి అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రతి సంక్రాంతికి సందడి చేస్తున్న నందమూరి బాలయ్య.... ఈసారి డాకు మహారాజుతో రచ్చ చేశాడు. ఈ సంక్రాంతి బరిలో మూడు బడా సినిమాలు రిలీజ్ అయితే నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు.. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది. ఇక ఈ సినిమా ఇంకా థియేటర్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో.. మాస్ యాంగిల్ విపరీతంగా ఉంది.

 

అదే సమయంలో సెంటిమెంట్ కూడా బాగా పండించారు బాబి కొల్లి. దాంతోపాటు ఫైట్ సీన్స్ అదరగొట్టేశారు బాలయ్య. ముఖ్యంగా డాకు మహారాజు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  తమన్ ఇవ్వడం సినిమాకు హైలైట్ అయింది. అదే గేమ్ చేంజెర్ ఇవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో... ఆ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొత్తం కామెడీ అలాగే కుటుంబ కథా చిత్రం కావడంతో.. ఆ సినిమా కూడా నడిచింది.

 

అంటే ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ అందరూ మాస్ యాంగిల్ తో పాటు కామెడీని... ఆస్వాదించారన్నమాట. కాబట్టి ఇకపైన వచ్చే సినిమాలన్నీ మాస్ యాంగిల్ తో పాటు మంచి మ్యూజిక్తో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే సమయంలో కామెడీ కూడా బాగా పండించాలని వాళ్లు చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమా రిలీజ్ చేసేందుకు నందమూరి బాలయ్య రెడీ అవుతున్నారు.

 

సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేదా దసరా కానుకగా రిలీజ్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో... కచ్చితంగా మాస్ యాంగిల్ దుమ్ము లేపుతుంది. అలాగే.. బిజిఎం కూడా  బాగుంటుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో... మూడు సినిమాలు హిట్ అయ్యాయి. కాబట్టి..అఖండ 2 తాండవం ఆడడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: