మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ విశ్వంభర.. ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రబోధ్ ఉప్పలపాటి,వంశీకృష్ణ రెడ్డి, విక్మ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అలా భారీ బడ్జెట్ సోషియో ఫాంటసి గా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాలతో విశ్వంభర మూవీ సంక్రాంతికి వస్తుంది అని డేట్ కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు.కానీ సడన్గా చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ గేమ్  ఛేంజర్ సినిమా కోసం తన రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకొని తన కొడుకు కోసం త్యాగం చేసినప్పటికీ ఆ త్యాగం ఫలించలేదు అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే చిరంజీవి తన రిలీజ్ డేట్ కొడుకు కోసం త్యాగం చేసినప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో చాలామంది నెటిజెన్లు తండ్రి త్యాగం చేసిన ప్రతిఫలం రాలేదు అని రాంచరణ్ పై ఫైర్ అయ్యారు. 

అంతేకాదు రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రాకపోయినా బాగుండు విశ్వంభర సినిమాతో సంక్రాంతికి చిరంజీవి హిట్టు కొట్టు అని మెగా ఫ్యాన్స్ అందరు రాంచరణ్ మీద గుర్రుగా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే భారీ అంచనాలతో వస్తున్న విశ్వంభర సినిమాకి టీజర్ రాకముందు వరకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక విశ్వంభర సినిమాపై హైప్ అంతా తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు టీజర్ లేదు. దాంతో చాలామంది నెటిజన్స్ టీజర్ చూసి పెదవి విరిచారు. ఇక ఈ టీజర్ విషయంలో చిరంజీవి కూడా డైరెక్టర్ పై ఫైర్ అయ్యారట. ఎందుకంటే సోషియో ఫాంటీసీ మూవీ కాబట్టి ఇందులో గ్రాఫిక్స్ విజువల్స్ చాలా బాగా చూపించాలి అని చిరంజీవి చెప్పారట. అయితే ఇంత టైం తీసుకున్న కూడా డైరెక్టర్ సరిగ్గా గ్రాఫిక్స్ విజువల్స్ ని చూపించకపోవడంతో చిరంజీవి సైతం డైరెక్టర్ పై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ కూడా భారీగానే పెట్టినట్టు తెలుస్తోంది.ఇక వాల్తేరు వీరయ్య సినిమా 110 కోట్లు బిజినెస్ చేసింది.ఇక ఈ సినిమాకి మరో 10 కోట్లు యాడ్ చేసి 120 కోట్ల బిజినెస్ చేయాలి అని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట. అయితే సినిమా గట్టిగా ఆడితే తప్పా 120 కోట్ల షేర్ ని వసూలు చేయదు. 120 కోట్ల షేర్ అంటే కచ్చితంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వస్తే తప్ప అన్ని కోట్లు కలెక్ట్ చేయడం కష్టం. అలాగే ఈ సినిమాని నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 60 కోట్లు, సీడెడ్ లో 15 కోట్లకు అమ్మాలని నిర్ణయించుకున్నారట. కానీ ఇంత రావాలంటే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఉండాలి. అలాగే చిరంజీవి దాదాపు 20 ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ సినిమాతో రాబోతున్నారు.ఎందుకంటే 2004లో అంజి వంటి సోషియో ఫాంటసీ సినిమాతో వచ్చినప్పటికీ ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది.కానీ ఈ సినిమాలో విజువల్స్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ సినిమా మాత్రం ప్లాఫ్ అయింది.కానీ అప్పటి రిజల్ట్ ఇప్పుడు రిపీట్ అవ్వకుండా ఈ సినిమా సక్సెస్ కొట్టాలంటే చిరంజీవి ఇంకా గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది.మరి చూడాలి విశ్వంభర మూవీ ఏ విధంగా ఉండబోతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: