ఏంటి డైరెక్టర్ సుకుమార్ లైవ్ లోనే మహిళ డైరెక్టర్ పై చేయి చేసుకున్నారా.. ఇంతకీ ఆ మహిళా డైరెక్టర్ ఎవరు? ఎందుకు సుకుమార్ ఆమెపై చేయి చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గానే పాన్ ఇండియా మూవీ పుష్ప-2 తో డైరెక్టర్ సుకుమార్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల పరంగా 1850 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమాకి సంబంధించి 20 నిమిషాలు ఆడ్ చేశారు. 20 నిమిషాలు ఆడ్ చేసిన కథతో ఈ సినిమాకి మరిన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో సుకుమార్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా సినిమా గురించి ప్రమోట్ చేయడం కోసం రచ్చబండ అనే ఒక ఈవెంట్ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాకి దర్శకురాలిగా చేసిన పద్మావతి మల్లాది మాట్లాడుతూ..ఈ సినిమా స్టోరీ తెలిసాక నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇందులో నిర్మాతగా నేను కూడా భాగం అవ్వాలి అనుకున్నాను. దాంతో ఈ విషయం నేను వాళ్లకి చెప్పాను.అయితే వాళ్లు కూడా దానికి ఓకే చెప్పారు. ఇక సినిమా తెరకెక్కే  సమయానికి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని వాళ్ళు అడిగితే నా దగ్గర ఐదు ఆరు వేలు మాత్రమే ఉన్నాయని నేను చెప్పాను అంటూ దర్శకురాలు పద్మావతి మల్లాది చెప్పింది.

అయితే ఈ విషయం వింటున్న సుకుమార్ వెంటనే లేచి ఈ మూవీకి నిర్మాతగా చేసిన శేష సింధు రావుని కొట్టిన వీడియో ప్రస్తుతం నేట్టింట వైరల్ అవుతుంది. అయితే శేష సింధు రావుని డైరెక్టర్ సుకుమార్ సరదాగానే లైవ్ లో అలా చేతితో తట్టారు. అంతే కానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సుకుమార్ లేడీ డైరెక్టర్ పై చేయి చేసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే సుకుమార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సరదాగా అలా కొట్టారు అంతే. ఇక గాంధీ తాత చెట్టు పచ్చదనం వంటి కాన్సెప్టు ను తీసుకొని చేయడంతో ఇప్పటికే ఈ సినిమాకి అంతర్జాతీయంగా, జాతీయంగా పలు ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను కూడా అందుకుంది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: