ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమలోకి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు. ఈ బ్యూటీ నాని హీరోగా గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో లభించింది. 

ఇకపోతే జెర్సీ సినిమా తర్వాత నుండి ఈమెకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ బ్యూటీ పోయిన సంవత్సరం ప్రారంభంలో వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ బ్యూటీ మాత్రం ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఇక పోయిన సంవత్సరం చివరన ఈమె మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా బాలకృష్ణ "డాకు మహారాజు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. 

ఈ సినిమాలో ఈ బ్యూటీ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: