ప్రభాస్ కెరీర్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా ఫౌజీ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు అనే సంగతి తెలిసిందే. హను రాఘవపూడి గత సినిమా సీతారామం అనే టైటిల్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ప్రభాస్ కెరీర్ లో ఫౌజీ మూవీ మరింత స్పెషల్ మూవీగా నిలవడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫౌజీ సినిమాకు సంబంధించి అధికారిక అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్ ను సైతం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఫౌజీ సినిమాలో కథ, కథనం విషయంలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. ఫౌజీ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ బ్యానర్ లో తెరకెక్కిన పుష్ప2 మూవీ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేకమైన బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. పుష్ప ది రూల్ సినిమాతో నిర్మాతలకు రికార్డ్ స్థాయిలో లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఈరోజు నుంచి పుష్ప2 మూవీ కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. రీలోడెడ్ వెర్షన్ ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానుంది. తక్కువ టికెట్ రేట్లతోనే ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రభాస్, బన్నీ కాంబోలో సినిమా వస్తే సంచలన రికార్డులు క్రియేట్ అవుతాయి.