టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల లో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి , తెలు గు సినిమా పరిశ్రమ లో అద్భుతమై న దర్శకుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి కాంబో లో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతు న్న విషయం మన అందరికీ తెలిసిందే . తాజా గా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడి యా లో వైరల్ అవుతుంది .

అసలు విషయం లోకి వెళితే ... చిరు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వీడియోను తయారు చేసి దాని ద్వారా ఈ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు , అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఓ వీడియోను తయారు చేసి దానిని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా ఈ సినిమాకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ను కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలా ఒక్క వీడియో ద్వారానే ఈ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు పెంచే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే అనిల్ రావిపూడి తాజాగా వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: