రామ్ చరణ్, శర్వానంద్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి వచ్చిన సెకండ్ ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయి సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.అయితే మొదటి ప్రోమోలో ఫ్యామిలీ గురించి సినిమా గురించి  బాలకృష్ణ రామ్ చరణ్ లు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్రోమోలో రాంచరణ్ తన ఫ్రెండ్స్ శర్వానంద్ అలాగే మరో ఫ్రెండ్ తో కలిసి వచ్చి హంగామా చేసిన ప్రోమో చూపించారు. అయితే ఇందులో శర్వానంద్ రాంచరణ్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. అలాగే రామ్ చరణ్ ప్రభాస్ కి కాల్ చేయగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది గణపవరానికి చెందిన అమ్మాయిని అంటూ రాంచరణ్ చెప్పడంతో అదెక్కడ ఉంటుంది యూరప్ లోనా అంటూ ప్రభాస్ నవ్వేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. అలాగే శర్వానంద్ వచ్చాక రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. 

అలా బాలకృష్ణ శర్వానంద్ రామ్ చరణ్ అలాగే వీరి మరో ఫ్రెండ్ ముగ్గురిలో అమ్మాయిలు ఎవరు ఎక్కువగా ప్లట్ చేస్తారు అని అడగగా శర్వానంద్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రాంచరణ్ పేరు చెప్పేశారు. అలా లైవ్ లోనే రామ్ చరణ్ అమ్మాయిల పిచ్చోడు అని శర్వానంద్ అలాగే ఇంకో ఫ్రెండ్ ఇద్దరు చెప్పకనే చెప్పేశారు. అలాగే మీ ముగ్గురిలో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికీ ఎక్కువగా ఉన్నారు అని అడగగా రాంచరణ్ ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి శర్వానంద్ కు ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పి నవ్వించారు.అలాగే మీ ముగ్గురు ఫోన్లు ఒకసారి ఇచ్చి మీ ఫోన్ లో ఉన్న చివరి మూడు మెసేజ్లు చూపెట్టమని అడగగా.. మేము ఫోన్ తీసుకురాలేదు మర్చిపోయాం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఈ ముగ్గురు మాట్లాడిన మాటలకు బాలకృష్ణ మీ ముగ్గురు పెద్ద దొంగలే అంటూ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.అలాగే రామ్ చరణ్ ని ఉపాసన ఇంట్లో కూడా రామ చరణ్ అనే పిలుస్తుందని చెప్పారు.కానీ కాస్త కోపం ఎక్కువ ఉంటే పేరు అదే పెట్టి పిలుస్తుంది కానీ టోన్ మారుతుంది అని చెప్పుకొచ్చాడు.అలాగే శర్వానంద్ గురించి ఒక్క ముక్కలో రామ్ చరణ్ ని చెప్పమంటే ఎప్పటికీ నమ్మగలిగే స్నేహితుడు అంటూ రాంచరణ్ చెప్పారు. అలాగే శర్వానంద్ ని రామ్ చరణ్ గురించి చెప్పమంటే రామ్ చరణ్ ఎవరికి సహాయం చేస్తాడో ఆ తీసుకునే వాడికి కూడా ఆ విషయం తెలియదు అంత గుట్టుగా చేస్తాడు అంటూ శర్వానంద్ చెప్పేశారు. అలా ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: