చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నాయి. కానీ వెంకటేష్ సినిమాలు ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాని దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో అదనంగా 220 షోలను అదనంగా ప్రదర్శించేందుకు చిత్ర బృందం సిద్ధమైందట.ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ని కూడా విడుదల చేసింది. దీన్నిబట్టి చూస్తే సంక్రాంతి విన్నర్ సినిమా సంక్రాంతికి వస్తున్నామే అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి డాకు మహారాజ్,గేమ్ ఛేంజర్ వంటి చిత్రాలు విడుదలైన కూడా ఈ రెండు సినిమాలకు థియేటర్లో ఎక్కడా కూడా పెంచమని డిమాండ్ కనిపించడం లేదు.
డాకు మహారాజ్ కూడా బాలయ్య ఖాతాలో హిట్టు వేసుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కాస్త ఎక్కువగానే ఉన్నదట. టికెట్ల కోసం థియేటర్స్ వద్దకు వచ్చి మరి దొరకపోవడంతో చాలామంది ఇంటికి వెళుతున్నారట. ఈ మేరకు గేమ్ ఛేంజర్ షోలు తగ్గించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి అదనపు షోలను అడ్జస్ట్ చేసేలా షోలను వేస్తున్నారట. అయితే ఈ విషయం చరణ్ అభిమానులను కాస్త మింగుటపడడం అయ్యేలా కనిపించలేదట. కానీ వ్యాపారపరంగా చూసుకుంటే మాత్రం ఇది తప్పదనే పరిస్థితిలలో కనిపిస్తోందట. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలకు దిల్ రాజ నిర్మాత కావడంతో స్క్రీన్లు పెంచే విషయంలో ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదని టాక్ వినిపిస్తోంది