సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే కెరీర్ను ప్రారంభించిన మొదటి సినిమా నుండి అద్భుతమైన విజయాలను అందుకుంటు అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం కెరీర్ను ప్రారంభించిన కొత్తలో వరుస అపజయాలను ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మూవీ తర్వాత ఈమె రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఈమె నటించిన మొదటి రెండు తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. కానీ ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాలను భారీగా ఆరబోయడంతో ఈ బ్యూటీ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో అపజయాలు ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈమె తెలుగులో నటించిన మూడవ సినిమా అయినటువంటి హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత నుండి ఈమె అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా కెరియర్ ప్రారంభంలో అపజయాలను ఎదుర్కొన్న ఈమె ప్రస్తుతం మాత్రం ఫుల్ జోష్లో కెరియర్ ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: