తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలు గా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగించిన వారిలో బ్రహ్మానందం ఒకరు . బ్రహ్మానందం నట వారసుడిగా ఆయన కుమారుడు గౌతమ్ చాలా సంవత్సరాల క్రితమే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు . అందులో భాగంగా ఈయన పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయాన్ని అందుకోకపోయినా మ్యూజికల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకొని బసంతి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత ఈయన మను అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రయోగాత్మకమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. గౌతమ్ తాజాగా బ్రహ్మ ఆనందం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బ్రహ్మానందం కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో బ్రహ్మానందం , గౌతమ్ తాతా , మనవల్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.

ఇకపోతే తాజాగా బ్రహ్మానందం మాట్లాడుతూ గౌతమ్ తన కెరియర్ లో ఓ అద్భుతమైన సినిమాను వదులుకున్నాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా బ్రహ్మానందం మాట్లాడుతూ ... శేఖర్ కమ్ముల కొంత కాలం క్రితం గోదావరి అనే సినిమాను రూపొందించాడు. ఆ సినిమాను మొదటగా గౌతమ్ తో చేయాలి అని శేఖర్ భావించాడు. అందులో భాగంగా గౌతమ్ కు కథను కూడా వినిపించాడు. కథ మొత్తం విన్న గౌతమ్ అది లేడీ ఓరియంటెడ్ సినిమాల ఉంది వద్దు అని వదిలేశాడు అని బ్రహ్మానందం తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: