సినిమా పరిశ్రమలో చాలా మంది మొదట సినిమా నుండే అందాలను ఆరబోసిన వారు ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం కెరియర్ ప్రారంభించిన కొత్తలో అందాల ఆరబోతకు చాలా దూరంగా ఉంటూ కేవలం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చి , ఆ తర్వాత తమ అందాలతో ప్రేక్షకులను అలరించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మలయాళ ప్రేమమ్ అనే సినిమాతో కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఈమె తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈమె కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే నటిస్తూ వచ్చింది. వాటితోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే మొదటి సారి ఈమె రౌడీ బాయ్స్ అనే సినిమాలో అందాలను విపరీతంగా ఆరబోసింది. 

ఏకంగా ఈ సినిమాలో లిప్ లక్స్ సన్నివేశాలలో కూడా నటించింది. ఈ మూవీ తర్వాత నుండి ఈమె అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు. ఈ బ్యూటీ ఆఖరుగా టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా ఈ బ్యూటీ తన అందాలను విపరీతమైన స్థాయిలో ఆరబోసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయింది. ఇకపోతే టిల్లు స్క్వేర్ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఆ మూవీ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: