అయితే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఇతర సినిమాలతో పోల్చి చూస్తే టికెట్ రేట్లు తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. 220 థియేటర్లు ఈ సినిమాకు అదనంగా జోడించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
దిల్ రాజు భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని మరిన్ని సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా సత్తా చాటాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. దిల్ రాజు సరైన డైరెక్టర్లను ఎంచుకుంటే పాన్ ఇండియా విజయాలను సొంతం చేసుకుంటారు.
ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ మరి కొందరు డైరెక్టర్లతో దిల్ రాజు సినిమాలను నిర్మిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజుకు 2025 సంవత్సరం ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాల్సి ఉంది. దిల్ రాజు క్రేజీ కాంబినేషన్లతో సినిమాలను ప్లాన్ చేస్తే ఈ నిర్మాత ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇతర టాప్ బ్యానర్లతో కలిసి దిల్ రాజు సినిమాలను నిర్మించాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. దిల్ రాజు నిర్మాతగా కంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కువ సంఖ్యలో విజయాలను అందుకుంటున్నారు.