తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై మోజు పెంచుకొని హిందీ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు . అలా తెలుగు సినిమా పరిశ్రమ నుండి హిందీ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసిన వారిలో సక్సెస్ అయిన వారి కంటే ఫెయిల్యూర్ అయిన వారి సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మాత్రం ఆ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకొని బ్యూటీలు ఎవరో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఈమె రామ్ పోతినేని హీరోగా రూపొందిన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన అనేక సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ సమయం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలా తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో ఈమె హిందీ సినిమా పరిశ్రమపై ఆసక్తిని చూపించి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఆమె తెలుగులో సక్సెస్ అయినంత స్థాయిలో హిందీలో కాలేదు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తెలుగు లో స్టార్ హీరోయిన్గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇకపోతే రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నంత స్థాయి గుర్తింపును హిందీ సినీ పరిశ్రమలో సంపాదించుకోలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: