తెలుగు తెరపై తిరుగులేని హాస్య బ్రహ్మగా వెలుగొందిన బ్రహ్మానందం ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. బ్రహ్మీ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. కానీ కొన్నాళ్లుగా ఈ కమెడియన్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. అయితే బ్రమ్మి దాదా 'రంగమార్తాండ' సినిమాలో మాత్రం సీరియస్ రోల్‌లో అద్భుతమైన నటనతో వెండి తెరపై మంటలు పుట్టించారు. కానీ ఆ తర్వాత ఆయన కనిపించిన సినిమాలు చాలా తక్కువ, అందులోనూ ఈ నిక్కర్ నారాయణకు పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని బ్రహ్మానందం స్వయంగా వెల్లడించారు. తన 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేశానని హల్వా రాజ్ అన్నారు. మళ్లీ మళ్లీ ఒకే తరహా కామెడీ చేస్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది కదా అని అభిప్రాయపడ్డారు. "నేను అదే తరహా పాత్రలు చేస్తూ పోతే, ప్రేక్షకులకు నవ్వు రాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉండాలి." అని ఈ హాస్యబ్రహ్మ స్పష్టం చేశారు.

ఇంకా బ్రహ్మి మాట్లాడుతూ, మనల్ని మనం తెలుసుకోవడం, మన వయసును అంగీకరించడం చాలా ముఖ్యమని అన్నారు. "మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి, లేనివి ఉన్నట్లుగా నటించకూడదు. మన వయసు మన నటనపై ప్రభావం చూపుతుంది. నేను గతంలో చేసినట్లుగా ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తే అది అంతగా బాగోదు. మనల్ని మనం విమర్శించుకోవడం చాలా అవసరం, అప్పుడే గౌరవం నిలుపుకోగలుగుతాం, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం" అని వివరించారు. ఆలోచించకుండా ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తే మనకున్న పేరు కూడా పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇకపోతే చిరంజీవి గురించి కూడా బ్రహ్మానందం మాట్లాడారు. వీరిద్దరూ కలిసి బావగారు బాగున్నారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చూశారు. అయితే ఇప్పుడు మళ్లీ చిరుతో కలిసి పనిచేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా భయపడతానని బ్రహ్మానందం అని కామెంట్లు చేసి షాక్ ఇచ్చారు. "షాట్ అయిపోయిన తర్వాత కూడా అందరూ ఓకే అనేంత వరకు నాలో ఏదో టెన్షన్ ఉంటుంది" అని చెప్పారు.

తన కుమారుడు గౌతమ్ కెరీర్ గురించి కూడా బ్రహ్మానందం ప్రస్తావించడం జరిగింది. తాను ఎప్పుడూ తన పలుకుబడిని ఉపయోగించి అవకాశాలు తెచ్చుకోలేదని, ఇతరుల కోసం కూడా అలా చేయలేదని స్పష్టం చేశారు. చివరగా, ఈయన మరో హాస్య నటుడు వెన్నెల కిషోర్ ను ప్రశంసించారు. "వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగా చేస్తాడు. అతన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది" అని బ్రహ్మానందం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: