ఈ సినిమా ఫిబ్రవరి నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాకు పట్టుదల అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే టైటిల్స్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా. ఫిబ్రవరి నెల 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో తండేల్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆ సమయానికి సంక్రాంతి సినిమాల హవా కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సిన్మాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో అజిత్ తన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీతో అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తర్వాత సినిమాలతో అజిత్ రేంజ్ అంతకంతకూ పెరగడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అజిత్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
అజిత్ గతంతో పోలిస్తే చేసే సినిమాల సంఖ్యను తగ్గించారు. అజిత్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే అజిత్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు. అజిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అజిత్ భవిష్యత్తు సినిమాలతో ఏ రేంజ్ సంచలనాలను సృష్టిస్తారో చూడాలి. అజిత్ తన కెరీర్ లో యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.