ఏంటి ఆ హీరోయిన్ కి ప్రభాస్ వల్ల నిద్రలేని రాత్రులు ఎదురయ్యాయా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ప్రభాస్ చేసిన పని ఏంటి.. ఎందుకు ఆ హీరోయిన్ ప్రభాస్ కోసం నిద్రలేని రాత్రులు గడిపింది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ కోసం నిద్రలేని రాత్రులు గడిపింది అంటే సోషల్ మీడియా జనాలందరూ ఏవేవో ఊహించుకుంటారు. కానీ అవన్నీ తప్పే. ఎందుకంటే ప్రభాస్ కోసం నిద్రలేని రాత్రులను గడిపింది కేవలం సినిమా కోసం మాత్రమే. మరి ఇంతకీ ప్రభాస్ సినిమా కోసం నిద్రలేని రాత్రులను సైతం గడిపి అంతలా కష్టపడిన హీరోయిన్ ఎవరయ్యా అంటే నిధి అగర్వాల్.. సవ్యసాచి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా చేసింది.అయితే చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ హీరోయిన్ కి సడన్గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ది రాజా సాబ్, పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం అందుకుంది.

 ఇద్దరు పెద్ద హీరోలు అలాగే భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు కావడంతో నిధి అగర్వాల్ కి ఇద్దరు హీరోలతో ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ దక్కుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా కోసం చాలా రోజుల నుండి పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇది కరోనా ఫస్ట్ వేవ్ ఉన్న సమయంలోనే షూటింగ్ మొదలెట్టారు. కానీ కరోనా అలాగే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కారణంగా సినిమాకి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అలా ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఈ ముద్దుగుమ్మ తరచూ బెంగుళూరు హైదరాబాద్ కి ప్రయాణం చేస్తూ ఉండేదట .

ఎందుకంటే అటు ప్రభాస్ అవకాశం ఇచ్చినప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఇటు పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్స్ ఇచ్చినప్పుడు పవన్ షూటింగ్ కి ఇలా తరచూ బెంగుళూరు హైదరాబాద్ కి తిరగడం కారణంగా చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపిందట. దాదాపు రెండు నెలల పాటు నిధి అగర్వాల్ నిద్రలేని రాత్రులను గడిపిందట తరచూ రాత్రులు కారులో జర్నీ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిందట. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సినిమా షూటింగ్ కి కరెక్ట్ టైం కి వచ్చేదట.అదే విషయాన్ని రీసెంట్ గా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు నిధి అగర్వాల్ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కాలని, ది రాజాసాబ్ అలాగే హరిహర వీరమల్లు సినిమాల ద్వారా నిధి అగర్వాల్ కి మంచి క్రేజ్ వచ్చి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: