ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల కలెక్షన్లను అందుకోవడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ సినిమా అయితే 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంటుందో ఆ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లే అని చాలా మంది భావిస్తూ వస్తున్నారు. దానితో చాలా మంది హీరోలు , దర్శకులు , నిర్మాతలు ఎలాగైనా వెయ్యి కోట్ల కలెక్షన్లను అందుకునే రేంజ్ సినిమాలను రూపొందించాలి అని అనేక ప్రయత్నాలను చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇండియన్ సినిమా పరిశ్రమలో ఓ ముద్దుగుమ్మ నటించిన మూడు సినిమాలు ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి.

ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ..? మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ దీపికా పదుకొనే. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాతో మొదటి సారి దీపిక నటించిన సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ తర్వాత ఈమె షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో రెండవ సారి దీపిక సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో దీపిక ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో మూడవ సారి దీపికా 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా దీపిక నటించిన మూడు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: