నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వచ్చిన డాకుమహారాజ్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాకుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్స్ గా చాందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ తదితర సెలబ్రిటీలు కూడా నటించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా మరొకసారి హైప్ తీసుకువచ్చింది.


అయితే తాజాగా బాలయ్య ఫ్యాన్స్ పైన పోలీస్ కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే డాకుమహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా జనవరి 12వ తేదీన రాత్రి సమయంలో కొంతమంది బాలయ్య అభిమానులు సైతం థియేటర్లు వద్ద పొట్టేలును తీసుకువచ్చి మరి అక్కడ బలి ఇవ్వడంతో పాటుగా దాని రక్తంతో పోస్టర్స్ పైన చల్లారు ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.



అయితే ఈ ఘటన పైన స్పందించిన తిరుపతి డిఎస్పి వెంకటనారాయణ వీరి పైన కేసు నమోదు చేయించినట్లు సమాచారం. అయితే ఈ వీడియోని పరిశీలించిన తర్వాత పోలీసు అధికారులు ఆర్సిపురం పట్టణానికి చెందిన మచ్చరెడ్డిపల్లి  ప్రాంతంలో ఉండేటువంటి శంకరయ్య, తిరుపతి కొర్లగుంటకు చెందిన రమేష్ అలాగే సురేష్ రెడ్డి, మరొక ప్రాంతానికి చెందిన ప్రసాద్ లోకేష్ బాబుల పైన కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. వీరందరి పైన జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్య అభిమానులు చేసిన ఈ హంగామా వారి మెడకే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఇక మీదటైనా ఇలాంటి జంతు హింసను బాలయ్య అభిమానులు ఆపుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: