నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ ఒక సినిమాలో తాను నటించాలి అనుకున్న ఓ స్టార్ హీరో సలహా మేరకు ఓ సినిమాను వదిలేసాడట. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయనతార హీరోయిన్గా కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో కథానాయకుడు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే కె ఎస్ రవి కుమార్ మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో జగపతి బాబును కాకుండా బాలకృష్ణ తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఈ సినిమా కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న బాలకృష్ణ ఆ సినిమాలో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట.


ఈ విషయం రజనీ కాంత్ కు తెలియడంతో బాలకృష్ణ కు ఫోన్ చేసి బాలకృష్ణ గారు మీరు నా సినిమాలో నా స్నేహితుడి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారంట నిజమేనా ..? అని అడిగాడట. దానికి బాలకృష్ణ అవును సార్ అని సమాధానం ఇచ్చాడట. దానితో రజిని మీకు ఆ పాత్ర సెట్ కాదు. ఆ పాత్ర చాలా క్లాస్ గా ఉంటుంది. మీలాంటి గొప్ప ఈమేజ్ ఉన్న హీరో ఆ పాత్ర చేస్తే జనాలకు అది అంతగా నచ్చకపోవచ్చు. మీ ఇమేజ్ కోసం భారీ యాక్షన్ సీన్స్ పెట్టినా కూడా పాత్ర పండే అవకాశాలు లేవు. మీలాంటి గొప్ప మాస్ ఈమేజ్ ఉన్న హీరో ఆ పాత్ర చేయకపోవడం బెటర్ అని సలహా ఇచ్చాడట. దానితో బాలకృష్ణ కూడా కన్విన్స్ అయ్యి ఆ సినిమా చేయను అని రవి కుమార్ తో చెప్పాడట. దానితో ఆయన కథానాయకుడు తెలుగు వర్షన్ లో జగపతి బాబును ఈ సినిమాలో రజనీ కి స్నేహితుడి పాత్రలో తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: