పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈరోజు మాట వినాలి సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ రిలీజ్ తో హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ అధికారికంగా మొదలయ్యాయని చెప్పవచ్చు. టిప్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ సాంగ్ రైట్స్ వల్ల యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
 
మాట వినాలి గురుడా మాట వినాలి అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ కు పెంచల్ దాస్ రచయిత కావడం గమనార్హం. సరళమైన పదాలతో పెంచల్ దాస్ ఈ సాంగ్ ను అద్భుతంగా రాశారు. ఈ సాంగ్ లో చాలా లోతైన అర్థం ఉంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్ కూడ అదుర్స్ అనేలా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
కేవలం 2 నిమిషాల 36 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలైనా కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు మూవీ మార్చి నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హరిహర వీరమల్లుకు సోలో రిలీజ్ డేట్ దక్కితే ఈ సినిమా సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు.


మరింత సమాచారం తెలుసుకోండి: