పూరి జగన్నాథ్ నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో గతంలో పైసా వసూల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది .. ఆ తర్వాత బాలకృష్ణ అఖండ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు .. పూరి జగన్నాథ్ మాత్రం వరుస అపజయాలతో కెరియర్లు మరి పాతాళానికి వెళ్లిపోయాడు .. అయితే ఇప్పుడు బాలయ్య ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి నాలుగు బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు .. అలాగే అఖండ 2 సినిమాని కూడా మొదలు పెట్టాడు .. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తర్వాత సినిమాపై కూడా ఇప్పుడే వార్తలు బయటకు వస్తున్నాయి ..


అయితే బాలకృష్ణ బోయపాటి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు బయటికి వస్తున్నాయి .. పూరి కూడా ఇప్పటికే బాలకృష్ణకు భారీ యాక్షన్ కథను కూడా చెప్పినట్టు తెలుస్తుంది . ఇక సమ్మర్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కూడా బయటకు రానుంది . అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అనేది కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు ..రెండు అగ్ర నిర్మాణ సంస్థల పేర్లు ఫైనల్ లిస్ట్ లో ఉన్నాయి .. వాటిలో ఒకటి చెరుకూరి సుధాకర్ .. అయితే మోక్షజ్ఞతో సినిమా ప్లానింగ్ లో ఉంది కానీ అది కాస్త టైం పెట్టే అవకాశం ఉంది ..


ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక పక్కన పెడితే బాలయ్య పూరీ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారు .. అలా కాకుండా మోక్షజ్ఞ సినిమానే ఆయన నిర్మిస్తే బాలయ్య సినిమాను సతీష్ కెళ్ళారు తన వృద్ధి సంస్థ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తారు .. ప్రజెంట్ ఆయన బుచ్చిబాబు , రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా మొత్తానికి బ్యానర్లు దర్శకుల విషయంలో నట‌సింహం బాలయ్య ఎంతో ఆచితూచిగా ముందుకు వెళ్తున్నారు .. సరైన కథ సరైన దర్శకుడు ఎవరు అన్నది చూస్తున్నారు .. అదే టైంలో బ్యానర్ ఎవరు అన్నది ఆయనే డిసైడ్ చేసుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: