అయితే రామ్ చరణ్ మాత్రం గేమ్ చేజర్ విషయంలో తమ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉందని ఇటీవల ఓ పోస్ట్ ను కూడా షేర్ చేశాడు. అయితే ఈ సినిమా తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని కూడా ఆయన అందులో రాసుకోచ్చాడు .. అందరూ గర్వపడేలా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడాన్ని కొనసాగిస్తానని పాజిటివ్ ఎనర్జీతో ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా హామీ ఇస్తున్నానని అందులో రాసుకోచ్చారు. ఇక దీనిబట్టి రామ్ చరణ్ ఎంతో పాజిటివ్ దృక్పథంతో తన తర్వాతి సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారని అర్థమవుతుంది. ఇక నిజానికి గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ ఎలాంటి ప్రమోషన్లు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఏమీ ఇవ్వలేదు .. రిలీజ్ అయిన తర్వాత కూడా మీడియాకి అసలు అందుబాటులోకి కూడా రాలేదు .. తన ఇంటికి వచ్చిన మెగా అభిమానులకి ధన్యవాదాలు తెలిపి భోజనం పెట్టి పంపించాడు .. ఆ తర్వాత రెండు రోజులు ఆగాక సోషల్ మీడియాలో థాంక్స్ నోట్ పంచుకున్నాడు ..
ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మేకర్స్ కూడా కొంత సైలెంట్ అయిపోయారు థాంక్స్ మీట్ గాని సక్సెస్ సెలబ్రేషన్స్ గాని వాటి మాటే ఎత్తలేదు .. ఇక దీంతో సినిమా ఫలితాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే నెటిజెన్లు అనుకుంటున్నారు..ఇక అభిమానులు సైతం గేమ్ చేంజర్ విషయాన్ని పక్కన పెట్టి .. రామ్ చరణ్ 16వ సినిమా మీదకు తమ ఫోకస్ను షిఫ్ట్ చేస్తున్నారు .. ఇక గత రెండు రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు వస్తున్నాయి .. డైరెక్టర్ బుచ్చిబాబు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని ఈ మూవీతో రామ్ చరణ్ మళ్లీ స్ట్రాంగ్ కంబాక్య్ ఇస్తారని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు .. ఈసారి మాత్రం అసలు గుర్రి తప్పదని నమ్మకంగా ఉన్నారు . రామ్ చరణ్ సోలోగా హిట్ కొట్టి దాదాపు ఏడు సంవత్సరాలు దాటడంతో రాబోయే సినిమాలతో ఎలా అయినా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం కచ్చితంగా ఏర్పడింది . ఇక మరి దీంతో బుచ్చు బాబుతో చేసే సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి అంచనాలను అందుకుంటారో చూడాలంటే కాలమే సమాధానం చెప్పాలి.