ఈ సంక్రాంతికి నిర్మాత దిల్ రాజు లక్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి .. భారీ బడ్జెట్ తో ఎన్నో హంగులతో ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్ మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది .. ఈ సినిమా కోసం దిల్ రాజు మంచినీళ్లు లాగా డబ్బులు ఖర్చు చేశాడు .. పాటల కోసం డైరెక్టర్ శంకర్ ఆయన చేత అనవసరంగా భారీగా ఖర్చు చేయించారు .. ఇలా దిల్ రాజు పని అయిపోయినట్టే.. ఒకవేళ రెండవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కమర్షియల్ గా పెద్ద హీట్ అయినా కూడా గేమ్ చేంజర్‌ మిగిల్చిన నష్టాలు పోడ్చ‌లేవనేది విశ్లేషకులు మాట .. కానీ ఆ సినిమానే దిల్ రాజు పాలిట గేమ్ చేంజర్ గా మారి ఆయన కొంప కొల్లేరు కాకుండా చేసింది .. ఈ సినిమా నేటితో మూడు రోజులు పూర్తి చేసుకుంది .


కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమాకి 40 కోట్లకు పైగా షేర్ వసూళ్లు, 66 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి .. ఓవరాల్ గా బిజినెస్ కేవలం 41 కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది .. అంటే కోటి రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్ మార్కును దాటినట్టే .. అయితే మూడో రోజులకి అడుగుపెట్టే సమయానికి బయ్యర్స్ కు కనీసం 13 కోట్ల రూపాయలు లాభాలో ఉంటారు .. దిల్ రాజు ఈ సినిమాని బయ్యర్స్ కి గేమ్ చేంజర్ తో కలిపి అమ్మడు గేమ్ చేంజర్ కి నష్టపోయిన బయ్యర్లు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా భారీ లాభాలు అందుకుంటున్నారు .. ఇక నిర్మాత దిల్ రాజ్ కి గేమ్ చేంజర్ ను నిర్మించేందుకు 300 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది .. ఇప్పటివరకు ఆ సినిమాకి ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు మాత్రమే వచ్చాయి.


ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు రోజుల్లోనే 55 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి .. మొత్తం మీద ఆయన జేబులోకి ఇప్పటివరకు 160 కోట్ల రూపాయలు వచ్చి పడింది .. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊపును చూస్తుంటే మొదటి వారంలోని 100 కోట్ల రూపాయలు షేర్ ఫుల్ రన్ లో ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ వసూళ్లు ను రాబట్టే సినిమాగా కనిపిస్తుంది .. ఇక మరో 100 కోట్ల రూపాయల షేర్ అదనంగా రాబోతుందన్నమాట .. గేమ్ చేంజర్ నుంచి మహా అయితే మరో 10 నుంచి 15 కోట్ల షేర్ వసూళ్లు వస్తాయి .. ఈ రెండు కలిపితే దిల్ రాజు బ్యాలెన్స్ అటు నష్టం లేక ఇటు పూర్తిస్థాయి లాభాలు లేక మధ్యస్థంగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ డిజిటల్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్ , ఆడియో రైట్స్ ద్వారా భారీ లాభాల్లోనే ఉన్నాడు .. మొత్తానికి 10 కోట్ల బడ్జెట్తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం ఈ సంక్రాంతికి దిల్ రాజును గట్టిగానే కాపాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: