స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి వయసులోనే సినిమాల్లోకి హీరోగా పరిచయమై తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మొదటగా అల్లు అర్జున్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆర్య సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా అనంతరం అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించారు.


కాగా, అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప-2. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప-2 సినిమాపై ప్రేక్షకులు విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు. అదే స్థాయిలో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప-2 సినిమాను థియేటర్లోకి తీసుకువచ్చారు.


సినిమా డిసెంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అదేవిధంగా కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వచ్చాయి. కాగా, పుష్ప-2 సినిమా నిర్మాతలు రూ. 2 వేల కోట్ల కలెక్షన్లపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగా సినిమా రీలోడెడ్ వెర్షన్ ను ఈ రోజు నుంచి థియేటర్లలో వేయనున్నారు.


20 నిమిషాల ఫుటేజీని అదనంగా సినిమాకు యాడ్ చేసినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో మూవీ రన్ టైం 3 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది. నైజాంలో టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ లలో రూ. 112, మల్టీప్లెక్స్ లలో రూ. 150గా ఉన్నాయి. ఈ సినిమా రూ. 1850 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సినిమాకు మరి కాస్త ఫుటేజీని యాడ్ చేయడంతో ఈ సినిమా చూడడానికి అభిమానులు మరోసారి ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: