తెలుగు ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఈమె మొదట్లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో వరుస సినిమాల్లో టించి భారీ విజయాలు అందుకుని తెలుగులోనే స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది .. అలా కొంతకాలం స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసి మధ్యలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా భూమిక నటించి అలరించింది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 45 సంవత్సరాలు .. ఇలా సహజంగాన్ని ఈ వయసులో హీరోయిన్గా ఆఫర్లు తగ్గుతాయి ..
అయితే భూమిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క , వదిన తరహా పాత్రులు చేస్తూ కొన్ని ప్రయోగిత్మక సినిమాల్లో కూడా నటిస్తుంది .. అయితే ఈ సీనియర్ బ్యూటీ తెలుగులో చివరగా సీతారామం సినిమాలో నటించింది .. తమిళంలో మాత్రం గత సంవత్సరం జయం రవి హీరోగా వచ్చిన బ్రదర్ సినిమాలో కూడా భూమిక నటించింది . అయితే ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీ 2007 లో భారత్ ఠాకూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .. ఇక వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు భూమిక సోషల్ మీడియాలో పలు ఫోటోలను పంచుకుంది .. ఆ ఫోటోలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ..
అయితే ఆమె భర్తకు ఓ అభిమాని లవ్ లెటర్ రాసి పంపించినట్లు కూడా ఆమె చెప్పకు వచ్చింది .. అలాగే అందులో నేను రాసింది మీ భార్యకు వినిపించండి అని కూడా ఆ అభిమాని చెప్పాడట .. ఇక ఆ లెటర్ తనను ఎంతగానో ఆకర్షించినట్లు భూమిక చెప్పుకొచ్చింది .. గతంలో భూమిక చేసిన ఈ కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే భూమిక తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు కూడా మొన్నటి వరకు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ భూమిక మాత్రం తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా గడుపుతుంది . తన పాత్రకు ప్రాధాన్యతో ఉన్న సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా లెవెల్ లో అదరగోడుతుంది.
View this post on InstagramA post shared by bhumika chawla (@bhumika_chawla_t)