మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతడు నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ పాత్ర పోషించారు. తండ్రి కొడుకుల పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ, అంజలి నటించారు. సూర్య విలన్ పాత్రను పోషించారు.


శ్రీకాంత్, జయరాం, సముద్రఖని, సునీల్ వంటి తదితరులు కీలకపాత్రలను పోషించారు. వివేక్ వెల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.... తమన్ సంగీతం అందించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగింది.


ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఏడు రోజుల్లో ఈ సినిమా రూ. 400 కోట్ల కలెక్షన్లను రాబట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని కేబుల్ టీవీలో ప్రసారమైన సంగతి తెలిసిందే. అక్కడి లోకల్ టీవీ ఛానల్లో పైరసీ హెచ్డీ ప్రింట్ ను ప్రసారం చేస్తున్నారని కొందరిని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.


కాగా గేమ్ చేంజర్ సినిమా పైరసీని కేబుల్ టీవీలో ప్రసారం చేసిన యజమాని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ పోలీసులు అప్పలరాజుకు చెందిన ఏపీ లోకల్ టీవీ ఆఫీసులో రైడ్స్ నిర్వహించారు. పైరసీ చేస్తున్నట్లు గుర్తించి పరికరాలను సేవ్ చేశారు. కేసు నమోదు చేసి అప్పలరాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: