- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగు  చిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమైన కత్రినా.. అనంతరం బాలీవుడ్ కి వెళ్లి వరుస సూపర్ హిట్ సినిమా లని అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది . ఇక " మల్లీశ్వరి " సినిమా ద్వారా టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ .. ఈ సినిమా హిట్ అవడం తో టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి . ఇక ఇదిలా ఉంటే .. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ వార్త వైరల్ అవుతుంది .


సౌత్ లో చేసింది తక్కువ  సినిమాలు చేసినప్పటి కీ  ఇక్క‌డ కొంత మంది స్టార్ హీరోల తో మాత్రం బాగా క్లోజ్ అయింది . ప‌లు పార్టీలలో కూడా కలుసుకుంటు  వారి నీ కూడా మంచి స్నేహితులు గా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ . ఇక అప్పట్లో ఓ కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడట . హీరోగా కూడా ఆయనే నటించాడు .అ సినిమా కు  సంబంధించి అప్ప‌టిలో రివ్యూలు టాక్‌ మంచిగా వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్ట లేకపోయింది .


అయితే ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయంలో ఆ హీరో దగ్గర ఒక్క రూపాయి కూడా లేదట ‌. ఎవరిని అడగాలో తెలియక కత్రినా ని రూ. 5 కోట్ల రూపాయలు డబ్బులు సద్దమని అడిగాడట . అడిగిన వెంటనే కత్రినా కూడా ఆ డబ్బులు ఇచ్చిందట . అయితే ఇప్పటివరకు ఆ కుర్ర హీరో ఆ ఐదు కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా కత్రినా కు తిరిగి ఇవ్వలేదట . ఆ కుర్ర హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ ... ప్రస్తుతం ఇదే  వార్త సోషల్ మీడియాలో తేగ‌ వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: