ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ విధంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకి ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన పనితీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా గత సంవత్సరం నుండి ఆయన పేరు విపరీతంగా మారు మ్రోగిపోతోంది. మొదటినుండి హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

రాజకీయాల్లో విజయం సాధించిన అనంతరం తిరుగులేని సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు. ఆయన తదుపరి సినిమా హరిహర వీరమల్లు, ఓజి కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా సినిమా షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నారు. సమయం దొరికినప్పుడు సినిమా షూటింగ్ తప్పకుండా చేస్తానని అభిమానులకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.


ఇదంతా పక్కకు పెడితే సంక్రాంతి సంబరాల్లో ఎక్కడా చూసిన పవన్ కళ్యాణ్ మేనియా కనబడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఉభయగోదావరి జిల్లాలలో సంక్రాంతి సమయంలో జరిగే ప్రబల సంబరాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలతో హోరెత్తించారు. ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, ప్రభలు మెరుస్తున్నాయి. వీటిని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది కోనసీమ కాదు కళ్యాణ్ సీమ అంటూ పోస్టులు సైతం చేస్తున్నారు.

కోనసీమలో పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు మేనియా ఎక్కువగా కనిపిస్తోంది. కాగా, తాజాగా ఏపీలో పవన్ కళ్యాణ్ కోసం భారీ కటౌట్ లను ఏర్పాటు చేశారు. ఏపీలోని మామిడి వరంలో ఈ కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. మామిడి వరానికి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఓ దేవాలయం  కోసం నిర్మించిన తరహానే పవన్ కళ్యాణ్ కమాన్ ఉంటుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: