బాలయ్య బాబు కోసం బాబీ ఈ సినిమా కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లున్నారు. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించేలా కథను తీర్చిదిద్దారు. కథ కొంచెం తెలిసినట్టుగా అనిపించినా, బాబీ మాత్రం చాలా చక్కగా, ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. అందుకే ఈ సినిమా అన్ని వయసుల వారిని అలరిస్తోంది.
ఇక ఈ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకుడు తమన్ చాలా కీలకమైన పాత్ర పోషించాడనే చెప్పాలి. తమన్ ఆఫర్ చేసిన మ్యూజిక్, సాంగ్ ట్యూన్లు సినిమాకు ప్రాణం పోశాయి. బాలయ్య, తమన్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. మంచి మ్యూజిక్ ఉంటే సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగలదని మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు.
దర్శకుడు బాబీ కొల్లి గతంలో మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తీశారు. ఇప్పుడు 'డాకు మహారాజ్' రూపంలో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి కళ్లు పడ్డాయి. నెక్స్ట్ వెంకటేష్ లేదా రవితేజతో బాబీ తన తర్వాతి సినిమా చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది.
మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడిగా బాబీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఖచ్చితంగా ఆయన తర్వాతి సినిమాపై కూడా భారీ అంచనాలు ఉంటాయి.