ముంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు హైదరాబాద్  నుంచి తిరుపతి వరకు చేరుకున్నాయి .. పండగపూట కూడా తగ్గేదేలే అని మంచు ఫ్యామిలీలోని ఇరువర్గాలు గొడవలకు దిగాయి .. కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు సర్దుకున్నాయని అనుకున్న క్రమంలో మళ్లీ అవి తారా స్థాయికి రావడం గమనార్హం .. ఇక దీంతో ఇప్పుడు ఇరువైపుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు చంద్రగిరి పోలీసులు కేసులు నమోదులు చేశారు. ఇక మోహన్ బాబు కాలేజీలోకి వెళ్లడానికి మనోజ్ ఆయన భార్య మౌనిక ప్రయత్నించారు .. అయితే మనోజ్ ను అక్కడకు అనుమతించకూడదని మోహన్ బాబు నాయిస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకోవటంతో పోలీసులు అతన్ని కాలేజీ లోపలికి రాకుండా అడ్డుకున్నారు ..

 

ఇక తన సొంత ఇంట్లోకి తనను వెళ్ళనీక పోవటం ఏంటని మనోజ్ వాదించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది .. ఇక చివరికి తన తాత , నాయనమ్మ సమాధుల్ని సందర్శించి వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇక తనతో పాటు తన భార్య మౌనికపై కూడా దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ చంద్రగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు .. ఆ మేరకు మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు తో పాటు ఎంబియూ సిబ్బంది పై కూడా కేసు నమోదు చేశారు .. మరోపక్క మోహన్ బాబు పి ఏ పిర్యాదు పై మనోజ్ దంపతులతో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు ..


సంక్రాంతి పండగ పురస్కరించుకొని మోహన్ బాబు ఆయన పెద్ద కొడుకు విష్ణు కుటుంబం విద్యానికేతన్ కాలేజీలోకి చేరుకుంది .. సంక్రాంతి వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న వీడియోలు బయటికి వచ్చాయి.  అక్కడకు ఊహించిని విధంగా మనోజ్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తినట్టు ప్రచారం జరుగుతుంది .. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ గొడవలు కేసులు ఇప్పుడు తాజాగా వారి స్వస్థలానికి చేరటం చర్చినియాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో మంచు ఫ్యామిలీ గొడవలు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: