ఏదైనా సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక పోస్టర్ లేదా వీడియో చాలు అనే సంగతి తెలిసిందే. దర్శకనిర్మాతలు స్పెషల్ వీడియోల ద్వారా సినిమాలపై అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలు సినిమాల స్పెషల్ వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రజనీకాంత్ నెల్సన్ కాంబో మూవీ జైలర్2 నుంచి తాజాగా ఒక వీడియో రిలీజ్ కాగా ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
 
కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో ది థగ్ లైఫ్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియోకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
 
రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాంతార1 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాని హిట్3, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి విడుదలైన వీడియోలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలన్నీ సక్సెస్ సాధించి మంచి లాభాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. 2025 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతమేర కలిసొస్తుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు ప్రమోషన్స్ విషయంలో అదరగొడుతుండగా ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయేమో చూడాల్సి ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2024 సంవత్సరంలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలన్నీ సక్సెస్ సాధించగా 2025 సంవత్సరంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ మూవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.


 
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: