ఇక తన సొంత ఇంట్లోకి తనను వెళ్ళనీక పోవటం ఏంటని మనోజ్ వాదించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది .. ఇక చివరికి తన తాత , నాయనమ్మ సమాధుల్ని సందర్శించి వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఇక తనతో పాటు తన భార్య మౌనికపై కూడా దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ చంద్రగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు .. ఆ మేరకు మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు తో పాటు ఎంబియూ సిబ్బంది పై కూడా కేసు నమోదు చేశారు .. మరోపక్క మోహన్ బాబు పి ఏ పిర్యాదు పై మనోజ్ దంపతులతో పాటు మరో ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు ..
సంక్రాంతి పండగ పురస్కరించుకొని మోహన్ బాబు ఆయన పెద్ద కొడుకు విష్ణు కుటుంబం విద్యానికేతన్ కాలేజీలోకి చేరుకుంది .. సంక్రాంతి వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంటున్న వీడియోలు బయటికి వచ్చాయి. అక్కడకు ఊహించిని విధంగా మనోజ్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తినట్టు ప్రచారం జరుగుతుంది .. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ గొడవలు కేసులు ఇప్పుడు తాజాగా వారి స్వస్థలానికి చేరటం చర్చినియాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో మంచు ఫ్యామిలీ గొడవలు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.