ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు అనేలా మారిపోయింది. ఆయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాకి భారీ బడ్జెట్ తో పాటు అది పాన్ ఇండియా లెవెల్ లోనే వస్తుంది. అయితే అలాంటి పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్ చిన్న డైరెక్టర్ తో మన ముందుకు రాబోతున్నారు అదే మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్ మూవీ.. స్టార్ డైరెక్టర్లు ఈయన తో సినిమా చేయడానికి క్యూ కడుతున్న వేళ మారుతితో ఈయన సినిమాకి ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.అయితే మారుతి చెప్పిన కథ బాగా నచ్చిందో ఏమో తెలియదు కానీ ప్రభాస్ కి కథ చెప్పిన వెంటనే మారుతికి ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ చేస్తున్నారు.అలాగే ఈ మూవీ ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడూ కనిపించని లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. 

అలాగే ఫస్ట్ టైం ప్రభాస్ హార్రర్ కామెడీ జానర్ లో సినిమా చేయబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ప్రభాస్ సలార్,కల్కి సినిమాలు హిట్ కొట్టడంతో ఈ రెండు సినిమాలు తర్వాత వస్తున్న ది రాజా సాబ్ మూవీపై కూడా భారీ హోప్స్ ఉన్నాయి ప్రేక్షకుల్లో. అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను ఖర్చు పెడుతున్నామని దీని నిర్మాత టీజి విశ్వ ప్రసాద్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు.అలాగే హార్రర్ సన్నివేశాల కోసం ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడని హారర్ సన్నివేశాలను ఈ మూవీలో తెరకెక్కిస్తున్నామని హారర్ సన్నివేశాల కోసం భారీగానే బడ్జెట్ పెడుతున్నామని చెప్పుకొచ్చారు.అలాగే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ లో ప్రభాస్ రాజు లుక్ లో సిగార్ పట్టుకొని సింహాసనం మీద ఉన్న ఫోటో రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ పై కొన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ గ్లింప్స్ చూస్తే మాత్రం ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి జానర్ లో సినిమా చేయలేదని చెప్పవచ్చు.అయితే మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో లేరో అనే డౌట్ కూడా కొంత మంది లో ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు నటిస్తున్నారు. అలాగే నయనతార కూడా ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్ 400కు పైగా కోట్ల బడ్జెట్ పెట్టడంతో చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిన్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకి 400 కోట్ల బడ్జెట్ ఏ నమ్మకంతో పెడుతున్నారు అని అందరికీ ఓ మూలన అనుమానం అయితే ఉంది.ఏది ఏమైనప్పటికి ప్రభాస్ రేంజ్ ను చూసే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని కొంతమందిలో నమ్మకం ఉంది.ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది అని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత మే 16 కి సినిమాని వాయిదా వేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: