మన సౌత్ ఇండస్ట్రీలో తన శక్తి సామర్థ్యాలను దేశమంతా చెప్పుకునేలా చేసిన నవతరం ద‌ర్శ‌కుల్లో ప్రశాంత్ నీల్‌ కూడా ఒకరు .. కేజీఎఫ్ , స‌లార్ సినిమాలు ప్రశాంత్ నీల్ స్టామినా ఏమిటో ఇండియన్ బాక్సోఫిస్ కు చూపించాయి .. కథ చెప్పే విధానం హీరోయిజాన్ని పండించే పద్ధతి .. ప్రధానంగా ఈ ఎలివేషన్లు , ఎడిటింగ్ పెట్రాన్ ఇవన్నీ కొత్తగా ప్రేక్షకులకు అనిపిస్తాయి .. మాస్ మీటర్ ని పట్టీ ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా తీయటం వరల్డ్ బిల్డింగ్ తో కొత్త రకంగా కథను చూపించడం ప్రశాంత్ నీల్ స్టైల్ .. తన సినిమాకు వస్తే ప్రేక్షకుల టికెట్ రేట్ గిట్టుబాటు అయ్యేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి ..


హీరోని బాగా చూపిస్తాడు అయితే ఒకే ఒక్క కంప్లైంట్ ఆయనలో ఉంది .. తన సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడు .. ఒక విధంగా ఆ పాత్రకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు కేజీఎఫ్ , కేజీఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్ పాత్ర ప్రేక్షకుల్లో తేలిపోతుంది.. సలార్ లో అయితే శృతిహాసన్ ఉన్న లేనట్టే అది రెగ్యులర్ సినిమాలోని హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తే డ్రాగన్ సినిమాలోను ప్రశాంత్ నీల్ హీరోయిన్గా రుక్మిణి వ‌సంత్‌ని తీసుకున్నారు .. అయితే రుక్మిణి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు సరిపడా హీరోయిన్ కాదు .. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటించే అంత స్టార్డం సైతం రుక్మిణికి లేదు .. ఆమె మంచి పర్ఫామెర్ అంతే ..


ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా రుక్మిణి పాత్రకు అంతగా స్కోప్ లేదని తెలుస్తుంది .. డ్రాగన్ లో పాటలకు కూడా చాన్స్ లేదని కూడా అంటున్నారు .. ఎన్టీఆర్ మంచి డాన్సర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే తన సినిమాలో మాస్ బీట్ ఉన్న పాటల్ని ప్రేక్షకులు కోరుకుంటారు. సలార్ లో కమర్షియల్ పాటలు లేకుండా చేసిన ప్రశాంత్‌ ఈసారి కూడా అదే రూట్ ను ఫాలో అవుతున్నారట .. ఈ సినిమాలోను ఎన్టీఆర్ , రుక్మిణిల మధ్య కూడా పాటలు లేవు అనేది ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం .. ప్రభాస్ ఫైట్ చేస్తే చాలు అనుకుంటారు ఆయన అభిమానులు అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం అభిమానులు ఇలా సంతృప్తి పడలేరు .. వాళ్లకు డాన్స్ మూమెంట్స్ కావాల్సిందే మరి ఈసారి ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: