గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లోకి విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. గేమ్ చేంజర్ సినిమాపై కొంతమంది కావాలని పని పట్టుకొని మరి ట్రోలింగ్ చేశారని, కక్షగట్టి ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని ఆరోపణలు గట్టిగానే వినపడుతున్నాయి. రీసెంట్ గా ఈ ట్రోలింగ్ కి ప్రపంచ యాత్రికుడు "నా అన్వేషణ"యూట్యూబ్ ఛానల్ అన్వేష్ ని కూడా వాడడం జరిగింది.
గేమ్ చేంజర్ సినిమా చూద్దామని టికెట్ తీసుకుని వెళ్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉందేంటి అంటూ అన్వేష్ చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోపై అన్వేష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమా చూశాను చాలా బాగుంది అని చెప్పారు. నాకు గేమ్ చేంజర్ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సినిమా స్టోరీ చాలా బాగుంది. కానీ ఈ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.
నేను ఏదో చిన్న మాట చెప్పినందుకు దానిని పట్టుకొని ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటూ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వీడియో అన్వేష్ పెట్టడం వెనక మెగా ఫ్యాన్స్ ఉన్నారని కొంతమంది అంటున్నారు. అతనిని కావాలనే బెదిరించి ఇలా చేయించారని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.