విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వెంకటేష్ తన సినిమాలు ద్వారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వెంకటేష్ సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. అదేవిధంగా తనదైన నటన, కామెడీ టైమింగ్ తో అభిమానులను ఆకట్టుకుంటాడు. వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లోకి విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు సంక్రాంతి పండుగ తోడవడంతో థియేటర్లో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాను చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు. దీంతో ఆదనపు షోలు థియేటర్లు యాడ్ చేస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టెమ్రాండస్ రెస్పాన్స్ తీసుకు వస్తోంది. కాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి.


కాగా, అనిల్ రావిపూడి రానా షోకి వెళ్లి సందడి చేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ.....ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ను మసాలా సినిమా సమయంలో మొదటిసారిగా కలిశానని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో చెప్పాడు. పటాస్ సినిమాను హీరో రానాతో చేయాలని అతడిని కలిస్తే, ఆ సమయంలో వెంకటేష్ గారిని కలిసానని మసాలా సినిమాకు పని చేశానని చెప్పి అనిల్ రావిపూడి చెప్పి షాక్ ఇచ్చారు.


అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ తో ఏడు ఎనిమిది కాదు కుదిరితే 10 సినిమాలు చేస్తానని అతనితో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయించాలని ఉందని అనిల్ రావిపూడి చెప్పాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి టాలీవుడ్ లో కాంబినేషన్లో ఈ సినిమా మరో సూపర్ హిట్ కాంబో అని ఫిక్స్ అవ్వవచ్చు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో 10 సినిమాలు కాదు వరుస సినిమాలు వచ్చిన ప్రేక్షకులు ఆదరించేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: