అయితే దూత అనే వెబ్ సిరీస్ లో నటించడంతో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇటీవలే బ్రేక్ అవుట్ అనే సినిమాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సినిమా ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం అనే సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ లాంచింగ్ కార్యక్రమానికి తన కుమారుడు రాజా గౌతమ్ తో కూడా వచ్చారు బ్రహ్మానందం. ఈ సమయంలోనే తన కుమారుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాలో హీరోగా అవకాశం వచ్చిన రిజెక్ట్ చేశారని తెలిపారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమాని చేస్తూ ఉన్నారు. శేఖర్ కమల బ్రహ్మానందం కి మంచి స్నేహబంధం ఉందట. శేఖర్ కమ్ములని తాను కమ్ముల శేఖర్ అని పిలుస్తానని.. ఎందుకంటే తను తన భార్య మేనల్లుడు అవుతారని తెలియజేశారు బ్రహ్మానందం. ఆ తర్వాత తన కుమారుడు తాను నటిస్తున్న బ్రహ్మానందం చిత్రానికి రాహుల్ మాధవ్ నక్క ఈ చిత్రాన్ని నిర్మించారంటూ తెలియజేశారు. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిపారు బ్రహ్మానందం అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు . మొత్తానికి శేఖర్ కమ్ముల తమకి బంధువు అనే విషయాన్ని తెలిపారు బ్రహ్మానందం.