సంక్రాంతి రేస్ కు విడుదలైన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాలక్షన్స్ పరంగా దూసుకు పోతోంది. వెంకటేష్ కెరియర్ లో 100 కోట్ల సినిమాగా ఈసినిమా అవుతుందని ఖచ్చితమైన అంచనాలు వస్తున్నాయి. ఈమూవీ రేంజ్ హిట్ తో పోలికలేకపోయినా బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ బయ్యర్లకు సేఫ్ ప్రాజెక్ట్ గా మారింది.



బిసి సెంటర్లలో ఈమూవీ కలక్షన్స్ సంతృప్తికరంగా ఉండటంతో బయ్యర్లు సేఫ్ అన్నవార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులు మాత్రం ఈమూవీలోని హీరోలతో పాటు ఈమూవీలో నటించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీలో శ్రద్దా శ్రీనాథ్ కూతురు గా నటించిన ఆ అమ్మాయి పేరు వేదా అగ్రవాల్.



వాస్తవానికి ఆఅమ్మాయి పుట్టింది ఆగ్రాలో అయినప్పటికీ ఆ అమ్మాయి తల్లి తండ్రులు హైదరాబాద్ లో సెటిల్ అవ్వడంతో ప్రస్తుతం ఆ అమ్మాయి పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటూ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ మూవీలో ఈ అమ్మాయి చిన్న పాత్ర చేసినప్పటికీ ఆపాత్రలో రాణించలేదు. అయితే బాలయ్యతో చేసిన ఈ పాత్రతో ఆమె అందరి దృష్టిలో పడతామే కాకుండా పెర్ఫార్మన్స్ పరంగా వేద అగర్వాల్ ఎక్స్ ప్రెషన్లు నటన అందర్నీ ఆకర్షిస్తున్నాయి.



ఇక సంక్రాంతి రేస్ కు వచ్చి బ్లాక్ బష్టర్ హిట్ గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్ కొడుకు బుల్లిరాజుగా నటించిన లడ్డు లాంటి చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రేవంత్ భీమల. ఈమూవీలోని కొన్ని సీన్స్ లో అతడు చేసిన యాక్టింగ్ కు ధియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తన తండ్రి వెంకటేష్ పై మాటల దాడి చేయడానికి వచ్చిన గ్రామస్తుల పై ఈ బుడ్డోడు చేసిన బూతుల డైలాగ్స్ దాడికి ధియేటర్లు నవ్వులతో దద్దరిల్లి పోతున్నాయి. ఈ రెండు సినిమాలలో నటించిన వీరిద్దరికీ మంచి భవిష్యత్ ఉంటుంది అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: