కాగా ఇదే క్రమంలో 'మీనాక్షి చౌదరి'కి మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి . రీసెంట్ గా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన లైఫ్ విషయాలను బయటపెట్టింది . తను ఎంత కష్టపడ్డి ఏ విధంగా ఈ స్థాయికి వచ్చాను అన్న విషయాలను ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . ఇదే మూమెంట్లో మీనాక్షి చౌదరి ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న మూడు కోరికలను కూడా బయట పెట్టింది . "నాకు చిన్నప్పటి నుంచి మూడు కోరికలు బాగా ఉండేటివి .. ఒకటి డాక్టర్ అవ్వాలి అని.. రెండు మిస్ ఇండియా అవ్వాలి అని.. మూడు సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ..ఇందులో మొదటి రెండు సాధించాను ఇక మూడోది మిగిలింది "అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో మీనాక్షి చౌదరి మాటలు వైరల్ గా మారాయి . మీనాక్షి చౌదరి చాలా సైలెంట్ గా కనిపిస్తుంది . కానీ ఎమోషనల్ పర్సన్ అంటూ కూడా బయటపడింది . పలు ఇంటర్వ్యూలలో ఆమె చేసిన అల్లరి నాటినెస్ అంతా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో కూడా ఆమె మంచి క్యారెక్టర్ లో మెరిసి తన కెరీర్ కు హిట్ అయ్యేలా ప్లస్ గా మార్చుకునేసింది. మొత్తానికి జరిగేటివి చూస్తూ ఉంటే 'మీనాక్షి చౌదరి' ఇండస్ట్రీలో మరొక స్టార్ హీరోయిన్గా పాగా వేయడం కన్ఫామ్ అంటున్నారు జనాలు . పూజా హెగ్డే స్థానాన్ని రీప్లేస్ చేస్తుంది అంటూ కూడా అభిప్రాయపడుతున్నారు . చూద్దాం ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ..? ప్రెసెంట్ మీనాక్షి చేతుల్లో రెండు తెలుగు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది..!